Srinivasa Rao: వివాహేతర సంబంధాలు, పోలీసు కేసులు... జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు నేరచరిత్ర!

  • జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు
  • ఓ యువకుడిపై గతంలో దాడి చేసిన నిందితుడు
  • 2017లో ముమ్మిడివరం పీఎస్ లో కేసు
  • వివాహేతర బంధాలపై గ్రామపెద్దల మందలింపు
జగన్ పై కోడిపందాలకు వాడే కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుపై గతంలోనే కొన్ని పోలీసు కేసులు నమోదయ్యాయి. కోడిపందాలపై ప్రేమతో చదువుకు మంగళం పాడేసిన శ్రీనివాసరావు, కూలీ పనులు చేసుకుని కాలం గడుపుతుండే తాతారావు, సావిత్రిల ఐదో సంతానం. ఠాణేలంకలో పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు. గత సంవత్సరం కాగిత వెంకటేశ్ అనే యువకుడిపై దాడి చేశాడని ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో ఓ కేసు నమోదై ఉంది. ఇక శ్రీనివాసరావుకు గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై గ్రామపెద్దలు పలుమార్లు శ్రీనివాసరావును మందలించినట్టు గ్రామస్తులు అంటున్నారు.
Srinivasa Rao
Jagan
Mummidivaram

More Telugu News