Supreme Court: మీరేంటి? మీ డ్రస్సులేంటి?: సీఎస్ లపై మండిపడ్డ సుప్రీంకోర్టు!

  • ఓ కేసు విచారణకు హాజరైన అరుణాచల్, గోవా సీఎస్ లు
  • స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకుని వచ్చిన ఉన్నతాధికారులు
  • చీవాట్లు పెట్టిన జస్టిస్ రంజన్ గొగొయ్
సక్రమమైన వస్త్రధారణ లేకుండా కోర్టు విచారణకు వచ్చిన ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి  రంజన్ గొగొయ్ నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం చీవాట్లు పెట్టింది.  విశ్రాంత న్యాయమూర్తులకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారన్న అంశంపై విచారణ జరుగగా, కోర్టు గతంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అరుణాచల్ ప్రదేశ్, గోవా సీఎస్ లు హాజరయ్యారు.

వీరిద్దరూ తమ షర్ట్ లపై స్లీవ్ లెస్ జాకెట్లు ధరించి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎస్ ముదురు పసుపు రంగులో మెరిసిపోతున్న జాకెట్ వేసుకుని వచ్చారు. దీంతో రంజన్ గొగొయ్, ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్ ల ధర్మాసనం వారి వస్త్రధారణను ఆక్షేపించింది. కోర్టు ముందుకు సీఎస్ స్థాయిలో హాజరవుతున్న వేళ హుందాగా వస్త్రాలు ధరించాలని హితవు పలికింది. వీరిద్దరూ చెప్పిందేదీ తాము వినబోమని ధర్మాసనం చెప్పడం గమనార్హం.
Supreme Court
Cs
Dress Sence
Ranjan Gogoi

More Telugu News