Jagan: సిటీ న్యూరో ఆసుపత్రికి వచ్చి కన్నీరు పెట్టుకున్న విజయమ్మ!

  • నిన్న విశాఖలో జగన్ పై దాడి
  • ప్రస్తుతం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న జగన్
  • కుమారుడిని చూసి తల్లడిల్లిపోయిన తల్లి
విశాఖపట్నంలో తనపై జరిగిన దాడి తరువాత, హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ జగన్ ను, వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పరామర్శించారు. ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉన్న జగన్ ను చూసిన ఆమె, కన్నీటిపర్యంతమయ్యారు. కుమారుడిని చూసి తల్లడిల్లిపోయిన ఆమె, చేతికి తగిలిన గాయం తీవ్రత గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న ఈ వార్త సంగతి తెలియగానే లోటస్ పాండ్ లోని ఇంట్లో ఉన్న ఆమె, కుప్పకూలిపోయారు. దాంతో నిన్న ఆసుపత్రికి రాలేకపోయిన ఆమె, ఈ ఉదయం వచ్చి, కుమారుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Jagan
YS Vijayamma
YSRCP
City Nureau Hospital

More Telugu News