Srinivasa Rao: దాడి నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిలో 9 ఫోన్లు మార్చాడు.. 10 వేల కాల్స్ మాట్లాడాడు: ఏడీసీపీ మహేంద్రపాత్రుడు

  • రెండు రోజుల క్రితం కూడా ఫోన్ మార్చాడు
  • కత్తి ఎలా తీసుకెళ్లారో పరిశీలించాల్సి ఉంది
  • ఫోటోలను మార్ఫింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను ఏడీసీపీ మహేంద్రపాత్రుడు వెల్లడించారు. తాజాగా మహేంద్రపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు ఏడాదిలో 9 ఫోన్లు మార్చాడని.. అలాగే 10 వేల కాల్స్ మాట్లాడాడని తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా ఫోన్ మార్చాడని ఆయన వెల్లడించారు. విచారణలో శ్రీనివాసరావు జగన్ అభిమాని అని తెలిసిందన్నారు.

కొందరు ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా పంపుతున్నారని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా తీసుకెళ్లారనే విషయంపై వీడియో ఫుటేజీలను పరిశీలించాల్సి ఉందన్నారు. విచారణకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని మహేంద్రపాత్రుడు తెలిపారు.
Srinivasa Rao
Jagan
Mahendra Patrudu
Airport
Knife

More Telugu News