ys jagan: మూడున్నర సెంటీ మీటర్ల లోతులో జగన్ భుజానికి గాయమైంది.. తొమ్మిది కుట్లు పడ్డాయి: ఎంపీ విజయసాయిరెడ్డి

  • కండరాల్లో నుంచి చొచ్చుకుపోయి మరి గాయమైంది
  • జగన్ పై భగవంతుడు దయ చూపాడు 
  • శ్రీ వేంకటేశ్వరస్వామి మా వైపు ఉన్నారు
వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిలో కుట్ర ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ తో సెల్పీ దిగుతానని కోరగా అందుకు తమ పార్టీ అధ్యక్షుడు అంగీకరించారని, సెల్పీ దిగుతున్నట్టుగా నటించి తన వద్ద ఉన్న కత్తితో తమ అధినేత మెడ కోసేందుకు యత్నించాడని అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడిపై భగవంతుడు దయ చూపాడు కనుక బతికి బయటపడ్డారని చెప్పారు. మూడున్నర సెంటీ మీటర్ల లోతులో జగన్ భుజానికి గాయమైందని, తొమ్మిది కుట్లు పడ్డాయని అన్నారు. కండరాల్లో నుంచి చొచ్చుకుపోయి మరీ గాయపరిచిందని, శ్రీ వేంకటేశ్వరస్వామి తమ వైపు ఉన్నారు కనుక జగన్ ని తాము రక్షించుకోగలిగామని అన్నారు. 
ys jagan
mp vijayasai reddy

More Telugu News