Allu Arjun: అల్లు అర్జున్ తోనే చేయాలనే పట్టుదలతో విక్రమ్ కుమార్

  • కథపై కసరత్తు చేస్తోన్న విక్రమ్ కుమార్ 
  • త్వరలో బన్నీని ఒప్పించే ప్రయత్నం 
  • ఆ తరువాత లింగుస్వామితో బన్నీ ప్రాజెక్టు
అల్లు అర్జున్ .. విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించిన పనులు కూడా కొంతవరకూ జరిగాయి. అయితే సెకండాఫ్ నచ్చకపోవడంతో, మరోలా మార్చి చెప్పమని అల్లు అర్జున్ చెప్పాడట. అప్పటి నుంచి సెకండాఫ్ విషయంలో అల్లు అర్జున్ ను ఒప్పించే ప్రయత్నం విక్రమ్ కుమార్ చేస్తూనే వస్తున్నాడు. అయితే విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ చేసే అవకాశం లేదనీ, విక్రమ్ కుమార్ మరో హీరోను ఎంపిక చేసే పనిలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.

కానీ విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా తప్పకుండా వుంటుందనేది తాజా సమాచారం. అల్లు అర్జున్ .. విక్రమ్ కుమార్ కి ఫోన్ చేసి, సెకండాఫ్ ఎంతవరకూ వచ్చిందని తరచూ అడుగుతూనే ఉన్నాడట. అందువలన తమ కాంబినేషన్లో సినిమా తప్పక ఉంటుందని సన్నిహితులతో విక్రమ్ కుమార్ చెబుతున్నట్టుగా సమాచారం. అదే నిజమైతే త్రివిక్రమ్ తరువాత సినిమాను విక్రమ్ కుమార్ తో చేసి, ఆ తరువాత ప్రాజెక్టును లింగుస్వామితో అల్లు అర్జున్ చేయవచ్చని చెప్పుకుంటున్నారు.     
Allu Arjun
vikram kumar

More Telugu News