jagan: జగన్ పై దాడిని ఖండిస్తున్నా.. సురేష్ ప్రభు దీనికి సమాధానం చెప్పాలి: ఒవైసీ

  • ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి ఓ వ్యక్తి కత్తిని ఎలా తీసుకొచ్చాడు?
  • ఇదంతా భద్రతా వైఫల్యమే
  • నేతల పాలిట సెల్ఫీలు ప్రమాదకరంగా మారాయి
వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని ఎంఐఎం అధినేత ఒవైసీ తెలిపారు. దీనికంతా కారణం భద్రతా వైఫల్యమేనని చెప్పారు. ఒక వ్యక్తి ఎయిర్ పోర్ట్ లోకి, లాంజ్ లోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడని ఆయన ప్రశ్నించారు. కేంద్ర విమానయాన మంత్రి సురేష్ ప్రభు ఈ ఘటనకు సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సెల్ఫీలు వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకులకు రక్షణ కరవైందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జగన్ ఎడమ చేతికి గాయమైంది. దాడికి పాల్పడ్డ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.
jagan
Asaduddin Owaisi
mim
YSRCP

More Telugu News