jagan: 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి.. జగన్ కు వైద్యుల సూచన

  • జగన్ భుజానికి మూడు కుట్లు
  • రక్త నమూనాల పరీక్ష
  • ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు
విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ కు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందించారు. ఆయన ఎడమ భుజంపై ఉన్న గాయానికి డాక్టర్లు మూడు కుట్లు వేశారు. జగన్ రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యులు సూచించినట్టు సమాచారం. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీ భద్రతను కల్పించారు. ఆసుపత్రికి జగన్ బంధువులంతా చేరుకున్నారు.
jagan
treatment
ysrcp

More Telugu News