Kothapalli Geetha: జగన్ పై జరిగిన దాడిపై స్పందించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత

  • దాడిపై ఖండన
  • ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని వ్యాఖ్య
  • ట్విట్టర్ వేదికగా స్పందన
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పందించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని వ్యాఖ్యానించిన ఆమె దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.

ఇదిలావుండగా, హైదరాబాద్ వెళ్లేందుకు వైజాగ్ విమానాశ్రయ లాంజ్ లో వేచివున్న జగన్ పై వెయిటర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కత్తితో భుజంపై పొడిచిన సంగతి తెలిసింది. దాడి అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
Kothapalli Geetha

More Telugu News