jagan: రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్ పై దాడి చేశారు: వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి

  • జగన్ సీఎం అవుతారనే భయంతోనే దాడి
  • లోతుగా విచారణ జరిపి, దుష్ట శక్తులపై చర్యలు తీసుకోవాలి
  • జగన్ కు భద్రతను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది
వైసీపీ అధినేత జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై దాడి చేశారని ఆ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఇది చాలా దారుణమని, దాడికి యత్నించిన దుష్ట శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతకు సరైన భద్రతను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అనే భయంతోనే దుష్టశక్తులు ఈ దాడికి యత్నించాయని చెప్పారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి, దుష్ట శక్తులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. 
jagan
attact
visakhapatnam
prasad reddy

More Telugu News