Roja: చంద్రబాబు నరకాసురుడు కాదా? ఇంకేం అనాలి?: రోజా నిప్పులు

  • టీడీపీ నేతలకు కాల్ మనీ, మహిళల అక్రమ రవాణాతో సంబంధం
  • మహిళా అధికారులను కాలితో తన్నిన ఎమ్మెల్యేను వెనకేసుకు రాలేదా?
  • డ్వాక్రా మహిళలకు తీవ్ర అన్యాయం చేసిన బాబు రాక్షసుడేనన్న రోజా
విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ తో సంబంధమున్న తెలుగుదేశం నేతలను వెనకేసుకుని వస్తూ, ఇసుక దందాను ప్రశ్నించిన మహిళా అధికారులను కాళ్లతో తన్నిన ఎమ్మెల్యేను కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబునాయుడిని నరకాసురుడితో కాకుండా ఇంకెవరితో పోల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆమె, తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన 600 హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఆ పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.

 మహిళలను అప్పుల పాలు చేసిన చంద్రబాబును, శూర్పణకల వంటి మహిళా మంత్రులు మాత్రమే దేవుడని అంటున్నారని విమర్శలు గప్పించారు. డ్వాక్రా మహిళలను నిండా ముంచేసిన చంద్రబాబు, రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆడవాళ్ల అక్రమ రవాణాలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని, ఇది కూడా చంద్రబాబు ఘనతేనని ఎద్దేవా చేశారు.
Roja
Chandrababu
Andhra Pradesh

More Telugu News