MeToo India: ముద్దుల కోసమే సినిమా తీశానా?: నటి సంజన ఆరోపణలపై మండిపడ్డ దర్శకుడు రవి శ్రీవత్స

  • రవి శ్రీవత్సపై ఆరోపణలు చేసిన సంజన
  • ఆమె అబద్ధాలు చెబుతోందన్న దర్శకుడు
  • చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
కేవలం చౌకబారు పబ్లిసిటీ కోసమే నటి సంజన తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోందని దర్శకుడు రవి శ్రీవత్స మండిపడ్డారు. ఆమె చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, వెంటనే క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాగా, ఓ సినిమా షూటింగ్ లో తనకు ఒక ముద్దు సీన్ అని చెప్పి, 30 ముద్దులు పెట్టారంటూ సంజన ఆరోపించిన సంగతి తెలిసిందే.

 దీనిపై స్పందించిన రవి శ్రీవత్స, తానేమీ ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదని చెప్పారు. సినిమాలో చాలా మంది నటించారని అన్నారు. హిందీ చిత్రం 'మర్డర్' కు రీమేక్ ను తీస్తున్నానని చెప్పి, ఆ చిత్రం సీడీని చూడమని సంజనకు ఇచ్చానని గుర్తు చేసుకున్న ఆయన, షూటింగ్ లో ఆమెపై ఎలాంటి వేధింపులూ జరగలేదని చెప్పారు. రేపు మధ్యాహ్నంలోగా ఆమె క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.
MeToo India
Sanjana
Ravi Srivatsa
Harrasment
Kiss Scens

More Telugu News