Ponnam Prabhakar: ఓటును ఎడమకాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్ కు బుద్ధి చెప్పండి: పొన్నం

  • మహాకూటమిని తిట్టడమే కేసీఆర్ పని
  • 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదా?
  • కేసీఆర్ ను ఇంటికి పంపించాల్సిన తరుణం ఆసన్నమైంది
మహాకూటమిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఓటును ఎడమ కాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రగతి భవన్ కే పరిమితమైన కేసీఆర్ ను ఇంటికి పంపించాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. శాతవాహన యూనివర్శిటీలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2009 లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని అన్నారు. 
Ponnam Prabhakar
kcr
mahakutami

More Telugu News