Uttar Pradesh: లక్నోలో లేని మాయావతి.. నగర సందర్శన చేస్తున్న పవన్ కల్యాణ్!

  • నిన్న లక్నో వెళ్లిన పవన్ కల్యాణ్
  • అందుబాటులో లేని మాయావతి
  • నగరంలోని పలు ప్రాంతాలు తిరిగిన జనసేనాని
ఉత్తరప్రదేశ్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలవలేదు. తృతీయ కూటమి ఏర్పాటు, ఎన్నికల్లో కలసి పోటీ చేసే అంశాలపై చర్చించేందుకు పవన్ వెళ్లారని తెలుస్తుండగా, లక్నోలో మాయావతి అందుబాటులో లేరు. దీంతో ఆయన నిన్నటి నుంచి మాయావతి కోసం వేచి చూస్తున్నారు. లక్నో చేరుకున్న ఆయనకు బీఎస్పీ నేతలు స్వాగతం పలికారు.

నిన్నంతా ఖాళీగానే ఉన్న ఆయన, లక్నోలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగర విశేషాలను బీఎస్పీ నేతలు దగ్గరుండి పవన్ కు చూపించారు. అంబేద్కర్ పార్కునకు వెళ్లిన పవన్, అక్కడి భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. పవన్ కల్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ తదితరులున్నారు. కాగా, నేడు మాయావతితో పవన్ చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Uttar Pradesh
Pawan Kalyan
Mayavati
Lucknow

More Telugu News