CBI: ఇంత అవమానకర పరిస్థితి ఎప్పుడూ లేదు: సీబీఐ మాజీ అధికారులు

  • ప్రస్తుత పరిణామాలు దురదృష్టకరం
  • గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు
  • విశ్వసనీయతను కోల్పోయింది
సీబీఐలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆ సంస్థ మాజీ అధికారులు షాక్‌కు గురయ్యారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలో ఇలాంటి అవమానకర పరిస్థితులు గతంలో ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య గొడవల విషయం తెలిసి విస్తుపోయినట్టు చెప్పారు.

 సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండడం దురదృష్టకరమని ఆ సంస్థ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ఎస్ ఖరాయత్ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ఖరాయత్ పేర్కొన్నారు.  సీబీఐ విశ్వసనీయతను కోల్పోయిందని మాజీ జాయింట్ డైరెక్టర్ ఎన్‌కే సింగ్ అన్నారు. తాజా పరిణామాలు దురదృష్టకరమని పేర్కొన్న ఆయన ఇటువంటి తరహా ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.
CBI
Narendra Modi
CBI Chief
NS Kharayat
NK Singh
BJP

More Telugu News