Visakhapatnam District: రేపు విశాఖలో భారీగా ఐటీ సోదాలు..ఇప్పటికే నగరానికి చేరుకున్న అధికారులు?

  • పారిశ్రామికవేత్తలు, చిట్ ఫండ్, రియల్ ఎస్టేట్ సంస్థలు లక్ష్యం 
  • టీడీపీ కీలక నేతల నివాసాల్లోనూ సోదాలకు ఆస్కారం 
  • సోదాల్లో పాల్గొననున్న 4 రాష్ట్రాల ఐటీ అధికారులు
ఇప్పటికే ఏపీలోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రేపు విశాఖపట్టణంలో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలోని పారిశ్రామికవేత్తలు, టీడీపీకి చెందిన కీలక నేతలు, చిట్ ఫండ్ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఈ సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం నుంచి ఐటీ సోదాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.  
Visakhapatnam District

More Telugu News