Chandrababu: బీజేపీ నేతలపై కోర్టు ధిక్కారం కేసు.. ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం!

  • మంత్రుల సమావేశంలో నిర్ణయం
  • బీజేపీ ఆరోపణలపై ఆగ్రహం
  • దురుద్దేశాలు అంటగట్టేలా ఆరోపణలు
బీజేపీ నేతలపై కోర్టు ధిక్కార కేసు వేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు.

అగ్రిగోల్డ్ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీతోనే కోర్టు ధిక్కార కేసు వేయించాలని నిర్ణయించారు. ఒకపక్క హైకోర్టు పర్యవేక్షణలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరుగుతుండగా.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కోర్టుకు దురుద్దేశాలు అంటగట్టే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు.
Chandrababu
Agri Gold
BJP
High Court
CID
State Government

More Telugu News