నా ఇన్స్టాగ్రాం హ్యాక్ అయింది!: రకుల్
- ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నటిస్తున్న రకుల్
- సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్
- లింక్స్, మెసేజ్‌ల పట్ల స్పందించవద్దు
ఇక ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. సినిమా చూసి రివ్యూలివ్వడం దగ్గర నుంచి పుట్టిన రోజులకు శుభాకాంక్షలు చెప్పడం వంటివన్నీ చాలా సరదాగా చేసేస్తోంది. తాజాగా రకుల్ ఇన్స్టాగ్రాం హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘నా ఇన్స్టాగ్రాం హ్యాక్ అయింది. అది రికవర్ అయ్యేంత వరకూ దాని నుంచి వచ్చే ఏ లింక్స్ పట్ల, మెసేజ్‌ల పట్ల స్పందించవద్దు’’ అని రకుల్ ట్వీట్లో అభిమానులను కోరింది.