Uttam Kumar Reddy: ఎవరు స్వీట్లు పంచుకుంటారో చూస్తారుగా!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో మేం విజయం సాధిస్తాం
  • ‘కాంగ్రెస్’ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు
  • నవంబర్ మొదటి వారంలో అభ్యర్థుల ప్రకటన చేసినా సరిపోతుంది
వేరే పార్టీల అభ్యర్థులను ప్రకటించే లోపు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి స్వీట్లు పంచుకుంటారంటూ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ- పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, ఎవరు స్వీట్లు పంచుకుంటారో చూస్తారు కదా అంటూ వచ్చే ఎన్నికల్లో తమ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని ఆరోపించారు. ఈ విషయమై కొందరు పోలీస్ అధికారులు ఎక్కువ చొరవ చూపుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పొత్తుల చర్చల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ చర్చలు త్వరలో ఓ కొలిక్కి వస్తాయని, నవంబర్ మొదటి వారంలో అభ్యర్థుల ప్రకటన చేసినా సరిపోతుందని, ఎన్నికల ప్రచారానికి ముప్పై రోజులు చాలని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు ఎవరు స్వీట్లు పంచుకుంటారో చూస్తారు కదా! అని ఆయన నవ్వుతూ అన్నారు. ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని ఉత్తమ్ తప్పుబట్టారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
Uttam Kumar Reddy
KTR
t-congress
TRS

More Telugu News