stock exchange: లాభాలతో ముగిసిన ఈరోజు స్టాక్ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 34,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 10,225 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 37 పైసలు కోలుకుని రూ.73.19గా కొనసాగుతోంది. ఇక, షేర్ల విషయానికొస్తే, హిందాల్కో, ఎయిర్ టెల్, హిందూ స్థాన్ పెట్రోలియం, బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, యస్ బ్యాంక్, గ్రాసిమ్ తదితర సంస్థల షేర్లు నష్టపోయాయి.
Go Back to Shorts
stock exchange
sensex
nifty

More Telugu News