srisailam project: శ్రీశైలం ప్రాజెక్టు చంద్రబాబు జాగీరా?: హరీశ్ రావు ఫైర్

  • చంద్రబాబు తెలంగాణకు మేలు చేసే వ్యక్తేనా?
  • ఈ విషయమై ప్రజలు ఆలోచించాలి
  • ఆంధ్రోళ్ల మోచేతుల నీళ్లు తాగేందుకు ఉత్తమ్ అలవాటు పడ్డారు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎక్కువ నీళ్లను తెలంగాణ వాళ్లు తీసుకుపోతున్నారంటూ ఢిల్లీకి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారని, ఈ ప్రాజెక్టు ఏమన్నా చంద్రబాబు జాగీరా? అంటూ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పాలమూరు ప్రాజెక్టు కట్టకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు తెలంగాణకు మేలు చేసే వ్యక్తేనా? ఈ విషయమై ప్రజలు ఆలోచించాలని సూచించారు.

కేసీఆర్ కన్నా ఆంధ్రావలసవాదులే నయమన్న టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల గురించి హరీశ్ రావు ప్రస్తావిస్తూ.. ‘రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పల్లకీలు మోసీ మోసీ.. ఆంధ్రోళ్ల మోచేతుల నీళ్లు తాగడానికి అలవాటుపడి వాళ్లే నయమంటున్నాడు’ అని మండిపడ్డారు. ఈరోజున మహాకూటమి పేరుతో వాళ్ల పొత్తులు ఎలా ఉన్నాయి? అక్రమపొత్తులు అని, టీజేఎస్ అధినేత కోదండరామ్ కూడా వాళ్ల పంచన చేరారని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
srisailam project

More Telugu News