nara brahmini: బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణిపై మంచు మనోజ్‌ ప్రశంసల జల్లు

  • నాకు తెలిసి దృఢమైన మహిళల్లో ఆమె ఒకరు
  • ఆమె ఆడ సింహం లాంటి వారు
  • శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది గ్రామాలు దత్తత తీసుకోవడం గొప్ప విషయం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు, సినీ నటుడు బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణిపై మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘బాలయ్య ఓ సింహం...ఆయన కూతురు బ్రాహ్మణి ఆడ సింహం’ అని ట్వీట్‌ చేశారు. తిత్లీ తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలోని తొమ్మిది గ్రామాలను బ్రాహ్మణి దత్తత తీసుకోవడం గొప్ప విషయం. ఆమె దృఢ చిత్తానికి ఇది నిదర్శనం. నాకు తెలిసిన దృఢమైన మహిళల్లో ఆమె ఒకరు. ఆమె స్ఫూర్తిదాయక చర్యలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
nara brahmini
manchu manoj
apriciation

More Telugu News