Metro: మెట్రో వచ్చాక... అమీర్ పేటను అధిగమించిన ఎల్బీనగర్!

  • ఇప్పటివరకూ అత్యధికులు ప్రయాణిస్తున్న స్టేషన్ గా అమీర్ పేట
  • తాజాగా ఆ రికార్డు ఎల్బీ నగర్ కైవసం
  • నిత్యమూ 30 వేల మంది ప్రయాణిస్తున్నారన్న ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ వాసులు అత్యధికంగా ఆదరిస్తున్న మెట్రో స్టేషన్ గా ఎల్బీ నగర్ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ అమీర్ పేట నుంచి అత్యధికులు రాకపోకలు సాగిస్తుండగా, ఇప్పుడా రికార్డు ఎల్బీ నగర్ కైవసమైంది. మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో 21 రైళ్లు, రోజుకు 284 ట్రిప్పులు వేస్తూ, సరాసరిన 1.25 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుండగా, నాగోల్ - అమీర్ పేట మార్గంలో 12 రైళ్లు 266 ట్రిప్పులు తిరుగుతూ, 50 వేల మందికి సేవలందిస్తున్నాయి.

 ఇక, అమీర్ పేట కన్నా ఎల్బీ నగర్ నుంచి అత్యధికులు మెట్రో రైలును ఎక్కుతున్నారని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీ నగర్ లో మెట్రో రైలు సేవలను నిత్యమూ 30 వేల మంది పొందుతున్నారని, రెండు రూట్లలో రోజుకు దాదాపు 1.75 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.
Metro
Hyderabad
Ameerpet
LB Nagar
NVS Reddy

More Telugu News