CBI: వచ్చీ రాగానే పవర్ చూపిన నాగేశ్వరరావు... సీబీఐ సెంట్రల్ ఆఫీస్ లో తనిఖీలు!

  • గంటన్నరగా తనిఖీలు 
  • ఆస్థానా, వర్మల చాంబర్లలో సోదాలు
  • కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు స్వాధీనం!
గత రాత్రి సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితుడైన మన్నెం నాగేశ్వరరావు, వచ్చీ రాగానే తనదైన శైలిలో విజృంభించారు. నియామకపు ఉత్తర్వులను తెల్లవారుజామున అందుకున్న ఆయన, ఈ ఉదయం సీబీఐ కేంద్ర కార్యాలయానికి వచ్చి తన సిబ్బందితో తనిఖీలు ప్రారంభించారు.

నిన్నటివరకు ఉన్న సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలు కూర్చునే గదులతో పాటు, వారి ప్రత్యేక సిబ్బంది గదుల్లో గంటన్నరగా తనిఖీలు జరుగుతున్నాయి. వారు వాడిన కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లను, ఇతర దస్త్రాలను నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్థానా, వర్మలతో పాటు దేవేందర్ చాంబర్లలోనూ తనిఖీలు సాగుతున్నట్టు సమాచారం. సీబీఐ కార్యాలయంలో జరుగుతున్న తనిఖీలపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.
CBI
Nageshwararao
Director
Raids

More Telugu News