TJS: మిగిలింది అగ్గిపెట్టె... టీజేఎస్ గుర్తిదే!

షార్ట్స్‌లో చూడండి
కోదండరామ్ స్థాపించిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కి ఎన్నికల గుర్తుగా అగ్గిపెట్టె ఖరారైనట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆప్షన్స్ గా, చేతిపార, రైతు నాగలి, అగ్గిపెట్టె, బతుకమ్మ, తంగేడు పువ్వు, టార్చిలైట్‌ తదితర గుర్తులను కోదండరామ్ ఎంచుకున్నప్పటికీ, అగ్గిపెట్టె మాత్రమే ఖరారయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు.

పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపిన టీజేఎస్ నేతలు, సాంకేతిక కారణంతో ఈసీ తాము కోరుకున్న గుర్తులను కేటాయించలేకపోయిందని అన్నారు. తమకు లభించిన గుర్తుతోనే ఎన్నికల్లో పోటీకి వెళతామని సూచించారు. కాగా, ఓట్లు చీలకుండా ఉండేందుకు టీజేఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
TJS
Kodandaram
Elections
Symbol
Matchbox

More Telugu News