రాత్రికి రాత్రే సీబీఐ డైరెక్టర్ ను మార్చేసిన ప్రభుత్వం... విజయరామారావు తరువాత మరో తెలుగు వ్యక్తికి అవకాశం!
- కొత్త డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావు
- ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ గా విధుల్లో
- వరంగల్ జిల్లాకు చెందిన నాగేశ్వరరావు
సీబీఐలో ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తున్నట్టు నియామకాల విభాగం ప్రకటించింది. 1986 బ్యాచ్ కి చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన ఒడిశా డీజీపీగానూ పనిచేశారు. వరంగల్ జిల్లా బోర్ నర్సాపూర్ ఆయన స్వగ్రామం.