Kettavan: ఒకే ఒక్క మాటతో తమిళ టాప్ హీరోపై అనుమానం లేవనెత్తిన హీరోయిన్!

  • 'కేట్టవన్'... దాని పక్కనే 'మీటూ' హ్యాష్ ట్యాగ్
  • ట్వీట్ చేసిన తమిళ హీరోయిన్ లేఖా వాషింగ్టన్
  • హీరో శింబుపై లైంగిక వేధింపుల అనుమానాలు
'కేట్టవన్'... దాని పక్కనే 'మీటూ' హ్యాష్ ట్యాగ్... ఒకే ఒక్క మాటను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడం ద్వారా తమిళ హీరోయిన్ లేఖా వాషింగ్టన్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. తమిళంలో 'జయంకొండాన్‌', 'వేదం', 'వా', 'కల్యాణ సమయల్‌ సాదం' తదితర సినిమాల్లో నటించిన ఆమె, గత మూడేళ్లుగా మరో చిత్రం చేయకుండా పరిశ్రమకు దూరంగా ఉంది. ఇప్పుడు ఒకే ఒక్క పదంతో అందరినీ ఆలోచనలో పడేసింది.

నిజానికి 'కేట్టవన్' అన్నది శింబు హీరోగా ప్రారంభమై, మధ్యలోనే షూటింగ్ ఆగిపోయిన సినిమా. ఆపై శింబు కూడా ఈ చిత్రాన్ని వదిలేశాడు. తాజాగా లేఖ, ఈ సినిమా పేరును వాడుతూ పోస్టు పెట్టగా, ఇది శింబును ఉద్దేశించి చేసినదేనని, ఆమెను శింబు లైంగికంగా వేధించి వుంటాడని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, గతంలో శింబుకు పలువురితో ఎఫైర్స్ ఉన్నాయని వచ్చిన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. శింబు అభిమానులు మాత్రం ఈ ట్వీట్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Kettavan
MeToo India
Lekha Washington
Simu
Kollywood
Tamilnadu

More Telugu News