Radha krishna: ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తిన పూజా హెగ్డే

  • చాలా మంచివాడు.. దయాగుణం ఎక్కువ
  • కథ చెబుతున్నప్పుడే ఫిక్స్ అయిపోయా
  • ప్రభాస్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కథానాయిక పూజా హెగ్డే ప్రశంసలతో ముంచెత్తుతోంది. ప్రస్తుతం పూజా ప్రభాస్‌తో కలిసి రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను, ప్రభాస్‌తో కలిసి పనిచేయడం గురించి పూజా మీడియాతో పంచుకుంది.

దర్శకుడు రాధాకృష్ణ తనకు కథ చెబుతున్నప్పుడే ఈ సినిమాలో నటించాలని ఫిక్స్ అయినట్టు పూజా వెల్లడించింది. ప్రభాస్ చాలా సరదాగా ఉంటాడని.. చాలా మంచి మనిషని.. దయాగుణం ఎక్కువని పూజా తెలిపింది. ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడని.. ప్రభాస్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని పూజా హెగ్డే స్పష్టం చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ రూపొందుతోంది.
Radha krishna
Prabhas
Puja Hegde
Italy
UV Creations

More Telugu News