gi tag: జీఐ ట్యాగ్ పొందిన బందరు లడ్డు, హైదరాబాద్ హలీం

  • మొత్తం 326 వస్తువులకు భౌగోళిక గుర్తింపు (జీఐ)
  • కాంచీపురం చీరలు, బాస్మతి బియ్యం తదితర వస్తువులకు జీఐ
  • సీఐపీఏఎం వెల్లడి
ఏపీలోని బందరు లడ్డు, హైదరాబాద్ లోని హలీం సహా మొత్తం 326 వస్తువులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. జీఐ ట్యాగ్ లభించిన ఈ 326 వస్తువుల్లో 14 విదేశాలకు చెందినవి ఉన్నాయి. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ విభాగానికి చెందిన సెల్ ఫర్ ఐపీఆర్ ప్రమోషన్స్ అండ్ మేనేజ్మెంట్ (సీఐపీఏఎం) సంస్థ పేర్కొంది. జీఐ ట్యాగ్ లభించిన మిగిలిన వస్తువుల్లో కాంచీపురం చీరలు, ఆల్ఫాన్నో మామిడి, నాగ్ పూర్ కమలాలు, కొల్హాపురి చెప్పులు, బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీ, ఛండేరి వస్త్రాలు, అలహాబాదు జామకాయ, కంగ్రా టీ, తంజావూర్ చిత్రాలు వంటివి ఉన్నాయి.
gi tag
bandaru laddu
Hyderabad haleem

More Telugu News