cbi: నా రాజకీయ రంగప్రవేశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: లక్ష్మీనారాయణ

  • కొత్త పార్టీ స్థాపించాలా? 
  • ఆహ్వానించిన పార్టీల్లో చేరాలా?
  • నిర్ణయానికి ఇంకా సమయముంది
తన రాజకీయ రంగ ప్రవేశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కొత్త పార్టీ స్థాపించాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు.

 ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు తమ పార్టీల్లో చేరమంటూ ఇప్పటికే తనను ఆహ్వానించాయని, దీనిపై తాను తటస్థంగా ఉన్నట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున తగిన వ్యూహంతో ముందుకెళ్తానని లక్ష్మీనారాయణ చెప్పారు.  
cbi
ex jd laxmi narayana
aap
BJP

More Telugu News