dunia vijay: తనను కొట్టాడంటూ.. కన్నడ నటుడు విజయ్ పై కేసు పెట్టిన కుమార్తె

  • బట్టలు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి తండ్రి ఇంటికి వెళ్లిన మోనిక
  • నా తండ్రి, ఆయన స్నేహితులు నన్ను కొట్టారంటూ ఫిర్యాదు
  • తప్పుడు కేసు పెట్టిందన్న దునియా విజయ్
కన్నడ నటుడు దునియా విజయ్ పై ఆయన కుమార్తె మోనిక (19) కేసు పెట్టింది. ఇప్పటికే విజయ్ పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఆయన కన్నకుమార్తె కేసు పెట్టడం సంచలనంగా మారింది.

విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. మోనిక తల్లి వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంట్లో ఉన్న తన బట్టలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వస్తువులను తీసుకోవడానికి నిన్న రాత్రి పదిన్నరకు అక్కడకు వెళ్లింది. ఈ సందర్భంగా విజయ్ తో పాటు అతని స్నేహితులు కూడా తనను కొట్టారని ఫిర్యాదులో మోనిక ఆరోపించింది. దీనిపై విజయ్ స్పందిస్తూ, మోనికను ఎవరూ, ఏమీ అనలేదని చెప్పారు. కావాలనే తనపై తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.  


dunia vijay
daughter
case

More Telugu News