rahul ramakrishna: పెళ్లి పీటలు ఎక్కనున్న కమెడియన్ రాహుల్

  • జనవరి 15న రాహుల్ వివాహం
  • ట్విట్టర్ ద్వారా తెలిపిన రాహుల్
  • కాబోయే భార్యతో కలసి ఉన్న ఫొటోను పంచుకున్న కమెడియన్
టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరికీ చెప్పకండి' అంటూ ట్వీట్ చేశాడు. తనకు కాబోయే భార్యతో సముద్రపు ఒడ్డున దిగిన ఫొటోను జత చేశాడు. అయితే వారి మొహాలు కనిపించకుండా ఫొటో ఉండటంతో... పెళ్లికూతురు ఎవరు? ఎలా ఉంటుంది? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరోవైపు పెళ్లి వార్తను వెల్లడించిన రాహుల్ కు హీరోలు నిఖిల్, సుశాంత్, సిద్ధార్థ్ కమెడియన్ వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ రామన్ లతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. 
rahul ramakrishna
tollywood
marriage

More Telugu News