Manchu Manoj: నా మాటలకు రాజకీయ రంగు పులమొద్దు: మంచు మనోజ్ విన్నపం

  • తిరుపతికి వచ్చిన మంచు మనోజ్
  • ఘన స్వాగతం పలికిన అభిమానులు
  • మరింత బలాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరానన్న మనోజ్
తాను ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ పనిని తాను పెరిగిన తిరుపతి నుంచి ప్రారంభించి, రాయలసీమకు విస్తరిస్తానని, సినిమాలకు విరామం ఇస్తానని నిన్న తన ట్విట్టర్ ఖాతాలో చెప్పిన మంచు మనోజ్, తిరుపతికి వెళ్లిన వేళ, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి భారీ ర్యాలీ సాగగా, తనకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు మనోజ్ ధన్యవాదాలు తెలిపాడు. ఇదే సమయంలో తన వ్యాఖ్యలపై రాజకీయ రంగు పులమవద్దని కోరాడు.

అభిమానులు స్వాగతం పలుకుతున్న చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఆయన, తనపై అపారమైన ప్రేమను చూపించి ఆశీర్వదించిన తిరుపతి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నాడు. తన శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రజలకు చిన్న విన్నపం చేస్తున్నానని, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నానని, ఈ పనికి రాజకీయ రంగులు పూయకండని అన్నాడు. అన్నీ కుదురుకుంటే, భవిష్యత్‌లో మరింత బలాన్ని, సహాయాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.
Manchu Manoj
Tirupati
Politics

More Telugu News