Drugs: డ్రగ్స్ తో పట్టుబడిన 'దూకుడు', 'నాయక్' విలన్ అజాజ్ ఖాన్!

  • పలు తెలుగు చిత్రాల్లో నటించిన అజాజ్ ఖాన్
  • 2.3 గ్రాముల డ్రగ్స్ తో ఉండగా అరెస్ట్
  • నేడు కోర్టు ముందు హాజరు పరచనున్న నార్కోటిక్స్ అధికారులు
పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించి మెప్పించిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్, తాజాగా నిషేధిత ఉత్ప్రేరకాలను దగ్గరుంచుకున్న కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం నార్కోటిక్స్ అధికారుల అదుపులో ఉన్న ఆయన్ను నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. బిగ్ బాస్ తో పాప్యులర్ అయిన అజాజ్, సినిమాల కన్నా, వివాదాలు, అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లోకి నిలుస్తుంటాడన్న సంగతి తెలిసిందే. అతని నుంచి 2.3 గ్రాముల డ్రగ్స్, రూ. 2.20 లక్షల నగదు, సెల్ ఫోన్స్ ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. తెలుగులో అజాజ్ ఖాన్, 'దూకుడు', 'నాయక్', 'బాద్ షా' తదితర చిత్రాల్లో నటించాడు.
Drugs
Bollywood
Tollywood
Azaz Khan

More Telugu News