హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. మహిళల సీట్లలో కూర్చుంటే జరిమానా వడ్డన!
- దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సీట్లకు వర్తింపు
- నిర్ణయం తీసుకున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- మహిళల ఫిర్యాదుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్
మెట్రో రైలులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ నంబర్ ను కేటాయించాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రో పరిసరాల్లో ఆక్రమణలు చేపట్టినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ముగ్గురు అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నియమించామన్నారు. ఎల్ బీ నగర్-మియాపూర్, నాగోల్-అమీర్ పేట మార్గాల్లో మెట్రో స్టేషన్లలో మిగిలిన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.