సీబీఐ డిప్యూటీ చీఫ్ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం!
- ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీబీఐ చీఫ్ అలోక్ వర్మ నిర్ణయం
- ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు
- సీబీఐ కార్యాలయంలోని ఆయన గదిలో సోదాలు
మరోవైపు, సీబీఐ బాస్‌పై ఆధారాలు లేకుండా ఆరోపణలు, కేసులు నమోదు చేయడానికి రాకేశ్ అస్థానాకు సహకరించిన అధికారి దేవేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులపై విచారణ జరగనుంది. ఇదిలావుండగా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానా చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని, అనైతికంగా వ్యవహరిస్తున్నారంటూ సీబీఐ డైరెక్టర్ వర్మ ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన మోదీ ఇరువురికీ సమన్లు పంపించారు.