indrasena reddy: మా వాళ్లకు నోటీసులిచ్చి... కవితకు ఎందుకు ఇవ్వలేదు?: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

  • ఇప్పటికైనా దొంగ ఓట్లను తొలగించాలి
  • ఏటీఎం వాహనాలు, అంబులెన్సులు కూడా తనిఖీ చేయాలి
  • కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు సూచించిన ఇంద్రసేన
హైదరాబాదులో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగించాలని గతంలోనే తాము కోరామని...అయినా స్థానిక అధికారులు వాటిని తొలగించలేదని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు హైదరాబాదులో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, పలు అంశాలను ఇంద్రసేన లేవనెత్తారు. బతుకమ్మ పోస్టర్లను వేసిన తమ నేతలకు నోటీసులు ఇచ్చారని, కవితకు మాత్రం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏటీఎంలకు డబ్బులు సరఫరా చేసే వాహనాలతో పాటు, అంబులెన్స్ లను కూడా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. 
indrasena reddy
kavitha
election commission
bjp
TRS

More Telugu News