Pavan kalyan: చంద్రబాబు తీరు శవాలపై పేలాలు ఏరుకున్నట్టు ఉంది: పవన్ విమర్శలు

  • వైసీపీ, మిగతా పార్టీల్లా అడ్డగోలుగా విమర్శించం
  • చంద్రబాబు ప్రచారానికి వాడుకున్నారు
  • మంత్రులంతా గాలికి వదిలేశారు
వైసీపీ, మిగతా పార్టీల్లా తాము అడ్డగోలుగా విమర్శించబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు తీరు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఉందని మండిపడ్డారు. విశాఖలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవడాన్ని కూడా చంద్రబాబు ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాము పర్యటించామని పేర్కొన్న పవన్, అక్కడి బాధితులకు సరైన సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఉన్నారు... ఇలాంటి పరిస్థితిని వీరు ముందే ఊహించలేకపోయారా? అని ప్రశ్నించారు. అసలు ఇలాంటి విపత్తులపై వీరికి అవగాహన ఉందా? అంటూ దుయ్యబట్టారు. మంత్రులంతా దీనిపై దృష్టి సారించకుండా గాలికి వదిలేసినట్టు అనిపించిందని పవన్ అన్నారు.
Pavan kalyan
Chandrababu
Achennaidu
Kala Venkat Rao
Vizag

More Telugu News