Vijaya Shanthi: కాంగ్రెస్ గెలిచే స్థానాలను మాత్రం అడక్కండి!: 'కూటమి' మిత్రులకు విజయశాంతి సూచన

  • గెలిచేందుకు స్థానాలు అడగాలి
  • కేసీఆర్‌కు 104 జ్వరం రావడం ఖాయం 
  • కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు
మహాకూటమి పొత్తుల్లో భాగంగా గెలిచేందుకు స్థానాలను అడగాలి తప్ప... కాంగ్రెస్ గెలిచే స్థానాలను అడగొద్దని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సూచించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి మాటల తూటాలు పేల్చుకుంటున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతున్న విజయశాంతి నేడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 100 సీట్లు రావడం కాదని.. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌కు 104 జ్వరం రావడం ఖాయమని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు విజయశాంతి ఒక ప్రకటన విడుదల చేశారు.
Vijaya Shanthi
Congress
KCR
Election Result
TRS

More Telugu News