Telugudesam: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సినీ నటి రేవతి చౌదరి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సినీ నటి రేవతి చౌదరి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత దేవేందర్ గౌడ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఈరోజు చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా రేవతి టీడీపీలో చేరారు.

రేవతి వివరాల్లోకి వెళ్తే, శివాజీ హీరోగా నటించిన చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. తారకరత్న నటించిన 'కాకతీయుడు' సినిమాలో కూడా ఆమె నటించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. విజయవాడకు చెందిన రేవతి నాగార్జున యూనివర్శిటీలో చదివారు. 1998లో మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. సినిమారంగంపై ఇష్టంతో హైదరాబాదుకు మకాం మార్చారు.
Go Back to Shorts
Telugudesam
Chandrababu
revathi chowdary
tollywood
actress

More Telugu News