Rajanikant: రహస్యంగా ఆటోలో ప్రయాణించిన రజనీకాంత్!

  • మనవడి కోరికను తీర్చిన 'బాషా'
  • పోయిస్ గార్డెన్ ముందు ఆటో ఎక్కిన తలైవా
  • ఆళ్వార్ పేటలోని సౌందర్య ఇంటికి ప్రయాణం

దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన 'బాషా' చిత్రంలో "నేను ఆటోవాణ్ణి ఆటో వాణ్ణి..." అంటూ ఆటోవాలాగా నటించి మెప్పించిన రజనీకాంత్, ఇప్పుడు ప్రయాణికుడిగా మారారు. అది కూడా అత్యంత రహస్యంగా. ఆయన ఆటో ప్రయాణం ముగిసిన తరువాతనే విషయం బయటకు తెలిసింది. రజనీకాంత్ మనవడు వేద్, ఆటో ఎక్కాలన్న కోరికను తన తాతయ్య వద్ద వెల్లడించడంతో, తన పోయిస్ గార్డెన్ నివాసం నుంచి ఆళ్వార్ పేటలో నివాసం ఉంటున్న చిన్న కుమార్తె సౌందర్య ఇంటికి ఆయన ఆటోలో ప్రయాణించారు. రజనీ రహస్యంగా ప్రయాణం సాగించిన ఆటోను అయన భద్రతా సిబ్బంది వెనుకే వెంబడించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News