Agrigold: అగ్రిగోల్డ్ స్కామ్ వెనుక లోకేశ్ మాస్టర్ ప్లాన్: కన్నా విమర్శల వర్షం

  • రూ. 3 వేల కోట్ల ఆస్తిని రూ. 270 కోట్లకే కొట్టేయాలని చూస్తున్న లోకేశ్
  • కుంభకోణం చూపించి, ఆస్తుల విలువ తగ్గిస్తున్నారు
  • విజయవాడలో కన్నా లక్ష్మీనారాయణ
సుమారు రూ. 3 వేల కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ ను రూ. 270 కోట్లకే కొట్టేయాలని చూసిన నారా లోకేశ్, అగ్రిగోల్డ్ ను ఇబ్బంది పెట్టించి, కుంభకోణం జరిగినట్టు చూపించి, వేలాది మందిని ఇబ్బంది పెట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నిప్పులు చెరిగారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన ఆయన, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, నేటి నుంచి ఐదు రోజుల పాటు నిరసన దీక్షలు చేయనున్నట్టు తెలిపారు.

విజయవాడలో ఆ పార్టీ నేత రామ్ మాధవ్ తో కలసి దీక్షను ప్రారంభించిన కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు, ఆయన తనయుడు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. లోకేశ్ అడిగిన ధరకు హాయ్ లాండ్ ను ఇవ్వలేదని, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ప్రభుత్వం రోజురోజుకూ తగ్గిస్తుస్తోందన్న కన్నా, ఈ విషయంలో సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
Agrigold
Kanna Lakshminarayana
Chandrababu
Vijayawada
Nara Lokesh

More Telugu News