Daggubati Suresh: యాక్సిడెంట్ చేసిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు.. కార్కానా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు!

  • 'టీఎస్ 09 ఈఎక్స్ 2628' కారులో దగ్గుబాటి
  • అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టిన కారు
  • ఐపీసీ సెక్షన్ 337 కింద కేసు నమోదు
ఈ ఉదయం టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పేరిట రిజిస్టర్ అయివున్న కారు (టీఎస్ 09 ఈఎక్స్ 2628) అదుపుతప్పి బీభత్సం సృష్టించగా, కార్ఖానా పోలీసు స్టేషన్ లో ఆయనపై కేసును రిజిస్టర్ చేశారు పోలీసులు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మూడేళ్ల చిన్నారి సిద్ధేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సిద్ధేష్ తండ్రి సురేష్ చంద్రకు వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపాయి. సురేష్ చంద్ర కాలు విరిగిందని వైద్యులు తెలిపారు. ఆయన భార్య దుర్గాదేవికి స్వల్పగాయాలు కాగా, చికిత్స తరువాత డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయంటే, కారు ఎంత వేగంతో ప్రయాణిస్తూ, ప్రమాదానికి కారణమైందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 337 కింద సురేష్ బాబుపై కేసును నమోదు చేశామని, విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తూ, సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.
Daggubati Suresh
Producer
Tollywood
Road Accident
Karkhana
Case

More Telugu News