Taiwan: తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 18 మంది దుర్మరణం

  • పట్టాలు తప్పిన రైలు
  • వంపు ఉన్నా వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణం?
  • మూడు దశాబ్దాల తర్వాత ఘోర దుర్ఘటన
తైవాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 175 మంది తీవ్రంగా గాయపడ్డారు. తైవాన్ ఈశాన్య ప్రాంతంలోని ఇలాన్ కౌంటీలో రైలు పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గత మూడు దశాబ్దాలలో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదం ఇదే కావడం గమనార్హం.

మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో రైలులో మొత్తం 366 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. రైలు చాలా వేగంగా ప్రయాణిస్తోందని, ముందు వంపు ఉన్నా రైలు అంత వేగంగా ఎందుకు వెళ్తోందా? అని ఆలోచిస్తుండగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో అతడి కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
Taiwan
Rail Accident
Yilan County
dead
Punjab
Rail Mishap

More Telugu News