Nellore District: బట్టలు కొనేందుకు డబ్బివ్వలేదని... భార్య ఆత్మహత్య!

  • నెల్లూరులో ఘటన
  • బంధువుల ఇంట శుభకార్యం
  • వెళితే బట్టలు పెట్టాలని చెప్పిన భార్య
  • డబ్బులు లేవన్నందుకు మనస్తాపంతో ఆత్మహత్య
తన బంధువులకు పండగకు బట్టలు పెట్టేందుకు అవసరమైన డబ్బులు ఇవ్వలేదన్న క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడి, తన ఇద్దరు బిడ్డలను అనాధలుగా చేసిన ఘటన నెల్లూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోవూరుకు చెందిన నాగరాజు, వాణిలకు 2012లో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు. నాగరాజు మార్బుల్స్‌ కు పాలిష్‌ వేసే పనులు సాగిస్తున్నాడు.

ఇటీవల వాణి చిన్నమ్మ కుమార్తె బిడ్డకు పుట్టు వెంట్రుకలు తీస్తున్నారని ఆహ్వానం అందింది. ఈ శుభకార్యానికి వెళితే, బట్టలు పెట్టాలని, అందుకు డబ్బివ్వాలని వాణి కోరిన వేళ, వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి, వాణిని నాగరాజు తిట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, స్థానికులు గుర్తించి, దర్గామిట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో జరిగిన గొడవ కారణంగానే వాణి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Nellore District
Sucide
Cloths
Police

More Telugu News