Odisha: ఒడిశాలో దారుణం.. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది పిల్లలతో చెరువులో దూకిన తల్లి!

  • ప్రాణాలు కోల్పోయిన ఇధ్దరు కుమార్తెలు
  • కొనప్రాణాలతో పోరాడుతున్న బాధితురాలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతే తన పిల్లలకు దిక్కుగా ఎవ్వరూ ఉండరన్న బాధతో వారిని చెరువులోకి తోసేసి తానూ దూకేసింది. ఈ ఘటన ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని లక్ష్మీప్రసాద్ గ్రామానికి చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి ఉంటోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడంతో బాధితురాలు మనస్తాపానికి గురైంది. చనిపోవాలని నిర్ణయించుకుని ఇద్దరు పిల్లలను తీసుకుని చెరువులోకి దూకేసింది.

ఈ దారుణాన్ని గమనించిన కొందరు చెరువులోకి దూకి తల్లీబిడ్డలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే పిల్లలిద్దరూ చనిపోగా, సదరు మహిళ మాత్రం కొన ప్రాణాలతో ఉంది. ఆమెను గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Odisha
nayagargh
suicide
mother and daughters
family issues
commit
lakshmiprasad village

More Telugu News