Daggubati Suresh: బైక్ ను ఢీకొట్టిన దగ్గుబాటి సురేష్ కారు... చిన్నారి సహా దంపతులకు తీవ్ర గాయాలు!

  • సికింద్రాబాద్ ప్రాంతంలో ఘటన
  • అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టిన కారు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, హీరో వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న సురేష్ బాబు కారు, అదుపుతప్పి ఈ యాక్సిడెంట్ చేసింది. కారు ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న దంపతులు, వారి మూడేళ్ల చిన్నారి కిందపడిపోయారు. తీవ్ర గాయాల పాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. ప్రమాదం తరువాత దగ్గుబాటి సురేష్ బాబు, మరో వాహనాన్ని తెప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
Daggubati Suresh
Car
Road Accident

More Telugu News