Anu Malik: సంగీత దర్శకుడు అను మాలిక్ లైంగికంగా వేధించాడు: డేనికా డిసౌజా

  • ఇండియన్ ఐడల్ షోలో ఘటన
  • పెద్దలకు తెలిసినా పట్టించుకోలేదు
  • నిర్మాణ సంస్థ ఉద్యోగిని డేనికా డిసౌజా ఆరోపణ
పలు సూపర్ హిట్ హిందీ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అను మాలిక్ పైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ ఐడల్ రియాల్టీ షో 5వ విడత జరుగుతున్న రోజుల్లో మాలిక్ తనను వేధించాడని డేనికా డిసౌజా అనే యువతి ఆరోపించింది.

 ఇండియన్ ఐడల్ ను నిర్వహిస్తున్న సంస్థలో పనిచేసిన డేనికా, తనపై తరచూ వేధింపులు జరిగాయని, అక్కడి పెద్దలకు ఈ విషయం తెలిసినా పట్టించుకోలేదని ఆరోపించింది. డేనికా ఆరోపణలతో తాజా ఇండియన్ ఐడల్ నుంచి అను మాలిక్ ను తప్పించే యోచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను అనూ మాలిక్ ఖండించాడు. తాను ఎవరినీ వేధించలేదని స్పష్టం చేశాడు.
Anu Malik
Danika Disouza
Harrasment
MeToo India

More Telugu News