Rajasthan: గ్యాంగ్ రేప్ నుంచి తప్పించుకునేందుకు కిందకు దూకేసిన యువతి!

షార్ట్స్‌లో చూడండి
ఇద్దరు కామాంధుల చేతుల్లో చిక్కి చిత్రహింసలకు గురైన ఓ యువతి వారి నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది. జైపూర్‌లోని ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం రాజస్థాన్‌కు చెందిన లోకేశ్ సైనీ (19), కమల్ సైనీ (20) అనే ఇద్దరు యువకులు 23 ఏళ్ల నేపాలీ యువతిని బంధించారు. శుక్రవారం నుంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు.

దీనికి తోడు చిత్రహింసలు కూడా పెడుతుండడంతో తాళలేని యువతి శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితులిద్దిరినీ అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Rajasthan
Jaipur
Gang Rape
Nepal Girl
police
Arrest

More Telugu News