Revanth Reddy: నేను టీడీపీలో ఉండి ఉంటే వందశాతం అవకాశం ఉండేది!: రేవంత్ రెడ్డి

  • చంద్రబాబును చూసి కేసీఆర్ భయపడుతున్నారు
  • పొత్తులను చూసి టీఆర్ఎస్ వణుకుతోంది
  • కాంగ్రెస్‌లో ఎవరు ఎలా అయినా ఉండొచ్చు
తాను కనుక టీడీపీలోనే ఉండి ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వందకు వందశాతం అవకాశం ఉండేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పలు విషయాలపై స్పందించిన రేవంత్.. ఏపీ సీఎం చంద్రబాబును చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విపరీతంగా భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేసి పొత్తుల గురించి విమర్శిస్తున్నాడంటేనే కేసీఆర్ ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.

'కాంగ్రెస్ పార్టీలో ఎగిరెగిరి దంచినా అంతే కూలి.. ఎగరకుండా దంచినా అంతే కూలి' అని చమత్కరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకునే వాళ్లకు అవకాశం ఉందని, అయితే, పార్టీలో ఎవరు ఎలా కావాలంటే అలా ఉండే స్వేచ్ఛ కూడా ఉందని అన్నారు. ఎదగాలనుకునే వాళ్లు ఎదగొచ్చని, పడిపోయేవాళ్లు పడిపోవచ్చని, నేర్చుకునే వాళ్లు నేర్చుకోవచ్చని రేవంత్ పేర్కొన్నారు.
Revanth Reddy
Congress
Chandrababu
Andhra Pradesh
TRS
KCR

More Telugu News